ట్రూకాలర్‌కు చెక్ పెడుతూ భారత్‌లో సిఎన్‌ఏపి సేవలు ప్రారంభం ఇక అపరిచిత కాల్స్ వివరాలు పక్కాగా తెలుస్తాయి

టెలికాం రంగంలో విప్లవాత్మక మార్పులు చేస్తూ ప్రభుత్వం కాల్లింగ్ నేమ్ ప్రజెంటేషన్ లేదా సిఎన్‌ఏపి వ్యవస్థను అందుబాటులోకి తెస్తోంది. ఇది ట్రూకాలర్ వలె కాకుండా సిమ్ తీసుకునే సమయంలో సమర్పించిన కేవైసీ వివరాల ఆధారంగా కాలర్ అసలు పేరును మొబైల్ స్క్రీన్‌పై చూపిస్తుంది. రిలయన్స్ జియో ఇప్పటికే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా పలు రాష్ట్రాల్లో ఈ సేవలను ప్రారంభించగా ఎయిర్‌టెల్ మరియు విఐ సంస్థలు వివిధ ప్రాంతాల్లో వీటిని పరీక్షిస్తున్నాయి.
ఈ విధానం పూర్తిగా మొబైల్ నెట్‌వర్క్ ఆధారంగా పనిచేస్తుంది కాబట్టి ఇంటర్నెట్ అవసరం లేదు. ట్రూకాలర్‌లో పేర్లను మార్చుకునే అవకాశం ఉంటుంది కానీ సిఎన్‌ఏపిలో అధికారిక డేటాబేస్ ఉపయోగించడం వల్ల తప్పుడు పేర్లు చూపే అవకాశం ఉండదు. బిఎస్ఎన్ఎల్ కూడా కొన్ని ప్రాంతాల్లో ఈ సేవలను ప్రయోగాత్మకంగా అమలు చేస్తోంది. వినియోగదారుల భద్రత కోసం నెట్‌వర్క్ ఆపరేటర్లు ఈ నమ్మకమైన వ్యవస్థను దశలవారీగా దేశవ్యాప్తంగా విస్తరిస్తున్నారు.