పెరగనున్న వంట గ్యాస్ ధరలు సబ్సిడీ లెక్కల్లో కీలక మార్పులు చేయనున్న కేంద్రం
December 31, 2025

దేశంలో వంట గ్యాస్ సిలిండర్లపై ఇచ్చే సబ్సిడీ విధానాన్ని కేంద్ర ప్రభుత్వం మార్చాలని యోచిస్తోంది. ఇప్పటివరకు సౌదీ కాంట్రాక్ట్ ధర ఆధారంగా సబ్సిడీని నిర్ణయించేవారు, కానీ ఇప్పుడు అమెరికా నుండి దిగుమతి చేసుకునే గ్యాస్ ధరలను కూడా పరిగణనలోకి తీసుకోనున్నారు. ప్రభుత్వ చమురు సంస్థలు ఇటీవల అమెరికా ఎగుమతిదారులతో భారీ ఒప్పందాలు చేసుకోవడమే దీనికి ప్రధాన కారణం.
సౌదీ అరేబియాతో పోలిస్తే అమెరికా నుండి గ్యాస్ రవాణా ఖర్చులు నాలుగు రెట్లు ఎక్కువగా ఉంటాయి. ఈ అదనపు భారాన్ని భరించడానికి ప్రభుత్వం సబ్సిడీని తగ్గిస్తే, సాధారణ ప్రజలతో పాటు ఉజ్వల పథకం లబ్ధిదారులపై కూడా ధరల భారం పడే అవకాశం ఉంది. ప్రస్తుతం ఢిల్లీలో సిలిండర్ ధర 853 రూపాయలుగా ఉండగా, సబ్సిడీ సూత్రం మారితే 33 కోట్ల మంది వినియోగదారుల ఖర్చులు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి.