పెళ్లైన నెల రోజులకే ప్రియుడితో చెక్కేసిన నవవధువు నగదు నగలతో పరార్

పెళ్లైన నెల రోజులకే ప్రియుడితో చెక్కేసిన నవవధువు నగదు నగలతో పరార్

ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో పెళ్లైన కేవలం నెల రోజులకే ఓ నవవధువు తన ప్రియుడితో కలిసి అత్తవారి ఇంట్లో నగలు, నగదుతో ఉడాయించింది. మనీష్ కుష్వాహా అనే యువకుడితో గత ఏప్రిల్ 27న ఘనంగా వివాహం జరిగింది. అయితే మే 27 అర్ధరాత్రి సమయంలో తన ప్రియుడు మరియు మరొక యువకుడి సహాయంతో ఆ వధువు ఇంటి నుండి బయటకు వెళ్ళిపోయింది. ఈ దృశ్యాలన్నీ ఇంట్లో ఉన్న సిసిటివి కెమెరాలో రికార్డయ్యాయి.

మరుసటి రోజు ఉదయం నిద్రలేచిన భర్తకు తన భార్య కనిపించకపోవడంతో పోలీసులకు సమాచారం అందించారు. సుమారు 15 లక్షల రూపాయల విలువైన బంగారు ఆభరణాలు, నగదును ఆ వధువు దోచుకెళ్లినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. రాజ్‌ఘాట్ పోలీస్ స్టేషన్‌లో ఈ ఘటనపై కేసు నమోదైంది. పవిత్రమైన బంధాన్ని కాలరాస్తూ చేసిన ఈ మోసం స్థానికంగా చర్చనీయాంశమైంది.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *