పదకొండో తరగతి విద్యార్థితో టీచర్ జంప్ పోలీసులకు చిక్కిన ప్రేమ జంట

పదకొండో తరగతి విద్యార్థితో టీచర్ జంప్ పోలీసులకు చిక్కిన ప్రేమ జంట

హర్యానాలోని పానిపట్‌లో ఒక వింత ఘటన వెలుగులోకి వచ్చింది. తన వద్ద ట్యూషన్ చదువుకుంటున్న 11వ తరగతి మైనర్ విద్యార్థితో కలిసి ఒక స్కూల్ టీచర్ పారిపోయింది. గత రెండేళ్లుగా ఆ విద్యార్థి టీచర్ ఇంటికి ట్యూషన్‌కు వెళ్తుండేవాడు. మే 29న ఇంటి నుంచి వెళ్లిన విద్యార్థి తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ వ్యవహారం బయటపడింది.

విడాకులు తీసుకున్న ఆ టీచర్ తన పుట్టింట్లోనే ఉంటూ విద్యార్థులకు పాఠాలు చెప్పేది. ఎటువంటి విలువైన వస్తువులు తీసుకోకుండా కేవలం ఉంగరంతో విద్యార్థితో కలిసి ఆమె పరారైంది. రంగంలోకి దిగిన పోలీసులు గాలింపు చేపట్టి ఎట్టకేలకు ఆ టీచర్‌ను అరెస్ట్ చేసి మైనర్ బాలుడిని స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం ఈ గురు శిష్యుల ప్రేమకథ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *