ఒక్క భర్త ఇద్దరు భార్యలు నెలకు 15 రోజుల చొప్పున వింత పంచుకోవడం
February 10, 2026

బీహార్లోని పూర్ణియా జిల్లాలో భర్త పంపకానికి సంబంధించిన ఒక వింత ఘటన వెలుగులోకి వచ్చింది. మొదటి భార్య ఉండగానే నిజం దాచి రెండో పెళ్లి చేసుకున్న ఒక వ్యక్తిపై వివాదం తలెత్తగా, ఫ్యామిలీ కౌన్సెలింగ్ సెంటర్ మధ్యవర్తిత్వంతో ఈ సమస్య పరిష్కారమైంది. ఇద్దరు భార్యలు అతనితోనే ఉంటామని పట్టుబట్టడంతో, అధికారులు వారి మధ్య ఒక రాజీ కుదిర్చారు. ఈ నిర్ణయం ఇప్పుడు స్థానికంగా చర్చనీయాంశమైంది.
కొత్త ఒప్పందం ప్రకారం సదరు వ్యక్తి తన ఇద్దరు భార్యలకు విడివిడిగా ఇళ్లు నిర్మించి పోషణ బాధ్యతలు చేపట్టాలి. అంతేకాకుండా నెలకు 15 రోజుల చొప్పున ఒక్కొక్క భార్య వద్ద గడపాలని నిబంధన విధించారు. ఈ ఒప్పందానికి ముగ్గురూ అంగీకరించగా, భవిష్యత్తులో మాట తప్పకుండా ఉండేందుకు వారి నుంచి చట్టపరమైన బాండ్ కూడా రాయించుకున్నారు.