బంగ్లాదేశ్‌లో ఆగని దాడులు చిట్టగాంగ్‌లో నాలుగు హిందూ దేవాలయాల్లో భారీ చోరీ

బంగ్లాదేశ్‌లో ఆగని దాడులు చిట్టగాంగ్‌లో నాలుగు హిందూ దేవాలయాల్లో భారీ చోరీ

బంగ్లాదేశ్‌లోని చిట్టగాంగ్ జిల్లా అనోవారా ప్రాంతంలో హిందూ దేవాలయాలే లక్ష్యంగా దుండగులు రెచ్చిపోయారు. ఉత్తర ఇచాఖాలీలోని శీల్‌పారాలో గల శ్రీ శ్రీ శివాలయం, శీతలా దేవి ఆలయంతో పాటు మరో రెండు ఆలయాల తాళాలు పగులగొట్టి దొంగతనానికి పాల్పడ్డారు. సుమారు లక్ష రూపాయల విలువైన బంగారు, వెండి మరియు రాగి వస్తువులను దుండగులు దోచుకెళ్లారు. ఈ వరుస ఘటనలతో స్థానిక హిందువులంతా తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.

గతంలో యశోర్ ప్రాంతంలో ఆలయాల ధ్వంసం జరిగిన తరుణంలో, ఇప్పుడు చిట్టగాంగ్‌లో జరిగిన ఈ దారుణం చర్చనీయాంశంగా మారింది. సర్వం కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేస్తూ స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వరుసగా హిందూ మతపరమైన స్థలాలపై జరుగుతున్న ఈ దాడులు మైనారిటీల భద్రతపై ప్రశ్నలు రేకెత్తిస్తున్నాయి. పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించి నిందితుల కోసం గాలిస్తున్నారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *