అమెరికాలో సొంత కుటుంబానికే వార్నింగ్ ఇచ్చిన భారత సంతతి విద్యార్థి అరెస్ట్
December 28, 2025

సొంత కుటుంబ సభ్యులపై ఉగ్రదాడి చేస్తానని మరియు ఇంటికి నిప్పు పెడతానని బెదిరించిన 22 ఏళ్ల భారత సంతతి విద్యార్థి మనోజ్ సాయి లాల్లాను టెక్సాస్ పోలీసులు అరెస్ట్ చేశారు. టెక్సాస్ యూనివర్సిటీకి చెందిన ఈ మాజీ విద్యార్థిపై వచ్చిన ఫిర్యాదు మేరకు ఫ్రిస్కో పోలీసులు గత సోమవారం అతడిని అదుపులోకి తీసుకున్నారు. తన కుటుంబ సభ్యుల ప్రాణాలకు ముప్పు కలిగిస్తున్నాడన్న ఆరోపణలతో ఈ చర్యలు చేపట్టారు.
పోలీసుల కథనం ప్రకారం మనోజ్ తన కుటుంబంపై తీవ్రస్థాయిలో దాడులకు పాల్పడతానని బెదిరింపులకు గురిచేశాడు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు అతడిని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. ఈ ఘటనకు గల పూర్తి కారణాలపై అమెరికన్ యంత్రాంగం ప్రస్తుతం లోతుగా విచారణ జరుపుతోంది.