జాతీయ జట్టు కెప్టెన్‌గా 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ సరికొత్త రికార్డు
December 28, 2025

దక్షిణాఫ్రికాతో జరగనున్న వన్డే సిరీస్ కోసం భారత అండర్-19 జట్టు కెప్టెన్‌గా 14 ఏళ్ల సంచలనం వైభవ్ సూర్యవంశీ ఎంపికయ్యారు. గాయం కారణంగా రెగ్యులర్ కెప్టెన్ ఆయుష్ మాత్రే జట్టుకు దూరం కావడంతో వైభవ్ ఈ కీలక బాధ్యతలు చేపట్టనున్నారు. జనవరి 4 నుంచి ప్రారంభమయ్యే ఈ మూడు వన్డేల సిరీస్ అండర్-19 ప్రపంచ కప్‌కు సన్నాహకంగా పరిగణించబడుతోంది.
అత్యంత పిన్న వయస్సులో జాతీయ జట్టుకు నాయకత్వం వహించే అవకాశం వైభవ్‌కు దక్కడం విశేషం. ఈ సిరీస్ ద్వారా యువ ఆటగాళ్ల సత్తా ప్రపంచానికి తెలియనుంది. దక్షిణాఫ్రికా గడ్డపై భారత యువ జట్టు ఏ మేరకు రాణిస్తుందోనని క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.