ట్రాఫిక్ చలానా పేరుతో సైబర్ దొంగల కొత్త మాయాజాలం ఒక్క క్లిక్కుతో మీ ఖాతా ఖాళీ కావచ్చు

డిజిటల్ విప్లవాన్ని ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్లు ఇప్పుడు ఈ-చలానా పేరుతో ప్రజలను దోచుకుంటున్నారు. మీ వాహనంపై భారీ జరిమానా పడిందంటూ నకిలీ లింకులతో కూడిన సందేశాలను పంపి భయపెడుతున్నారు. ఈ లింక్‌ను క్లిక్ చేయగానే ప్రభుత్వ వెబ్‌సైట్‌ను పోలిన నకిలీ సైట్‌లోకి తీసుకువెళ్లి మీ బ్యాంక్ వివరాలను సేకరిస్తున్నారు. ఇలాంటి సుమారు 36 నకిలీ వెబ్‌సైట్లు ప్రస్తుతం ఇంటర్నెట్‌లో తిరుగుతున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
అపరిచిత వ్యక్తుల నుండి వచ్చే సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలి మరియు ఎటువంటి లింకులను క్లిక్ చేయకూడదు. చలానా వివరాల కోసం ఎల్లప్పుడూ అధికారిక వెబ్‌సైట్ లేదా ‘mParivahan’ యాప్‌ను మాత్రమే వాడండి. ఒకవేళ మీరు మోసపోయినట్లు అనిపిస్తే వెంటనే 1930 నంబర్‌కు కాల్ చేసి ఫిర్యాదు చేయండి. ఏదైనా వెబ్‌సైట్‌లో కేవలం కార్డు పేమెంట్ ఆప్షన్ మాత్రమే ఉంటే అది మోసమని గ్రహించి జాగ్రత్త పడటం ఎంతో ముఖ్యం.