అరవల్లి పర్వతాల రక్షణపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం సోమవారం ముగ్గురు న్యాయమూర్తుల బెంచ్ విచారణ

అరవల్లి పర్వతాల రక్షణపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం సోమవారం ముగ్గురు న్యాయమూర్తుల బెంచ్ విచారణ

అరవల్లి పర్వత శ్రేణుల రక్షణ మరియు వాటి నిర్వచనానికి సంబంధించిన అంశంపై సుప్రీంకోర్టు సుమోటోగా విచారణకు స్వీకరించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం సోమవారం ఈ కేసును విచారించనుంది. పర్యావరణ పరిరక్షణ దృష్ట్యా అరవల్లి ప్రాంతంలో కొత్త మైనింగ్ లీజులపై కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే నిషేధం విధించిన నేపథ్యంలో అత్యున్నత న్యాయస్థానం ఈ నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది.

పర్యావరణ సమతుల్యత మరియు తాగునీటి వనరుల రక్షణ కోసం అరవల్లిని కాపాడుకోవడం అత్యవసరమని ప్రభుత్వం భావిస్తోంది. శాస్త్రవేత్తల బృందం పూర్తిస్థాయి మ్యాపింగ్ మరియు భద్రతా ప్రణాళికను సిద్ధం చేసే వరకు ఎటువంటి కొత్త తవ్వకాలకు అనుమతి ఉండదని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. అక్రమ మైనింగ్‌ను అరికట్టడంతో పాటు గ్రీన్ అరవల్లి ప్రాజెక్టు ద్వారా పచ్చదనాన్ని పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వం మరియు న్యాయస్థానం అడుగులు వేస్తున్నాయి.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *