బంగ్లాదేశ్‌లో జేమ్స్ కన్సర్ట్‌పై మతోన్మాదుల దాడి రాళ్ల వర్షంలో ముప్పై మంది విద్యార్థులకు గాయాలు
December 28, 2025

ప్రముఖ రాక్ సింగర్ జేమ్స్ సంగీత కచేరీని లక్ష్యంగా చేసుకుని ఫరీద్‌పూర్ జిల్లా స్కూల్‌లో మతోన్మాద మూకలు బీభత్సం సృష్టించాయి. వేదికపైకి దూసుకెళ్లి కర్రలతో దాడి చేయడమే కాకుండా, విచక్షణారహితంగా రాళ్లు రువ్వడంతో సుమారు 30 మంది విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా నిర్వాహకులు కార్యక్రమాన్ని రద్దు చేయడంతో, జేమ్స్ వేదికపైకి రాకుండానే డాకాకు తిరిగి వెళ్లాల్సి వచ్చింది.
ఈ ఘటనపై రెండు బెంగాల్‌ల కళాకారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో విద్యార్థి ఉద్యమాలకు మద్దతు తెలిపినప్పటికీ, జేమ్స్ వంటి దిగ్గజ కళాకారుడికి ఇలాంటి చేదు అనుభవం ఎదురుకావడం సాంస్కృతిక వినాశనానికి నిదర్శనమని మేధావులు ఆందోళన చెందుతున్నారు. నిర్వాహకుల వైఫల్యం మరియు భద్రతా లోపాలు ఈ హింసకు ప్రధాన కారణమని విమర్శలు వస్తున్నాయి.