ఒకే కాన్పులో కవల పిల్లలు జన్మించినా ఆ ఇద్దరు బిడ్డలకు తండ్రులు వేర్వేరు వ్యక్తులు

పోర్చుగల్‌లోని మినీరోస్ నగరంలో 19 ఏళ్ల యువతి కవల పిల్లలకు జన్మనివ్వగా, వారిద్దరికీ తండ్రులు వేర్వేరు అని తేలడం సంచలనం సృష్టించింది. డీఎన్ఏ పరీక్షల ద్వారా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. సదరు యువతి ఒకే రోజు ఇద్దరు వేర్వేరు వ్యక్తులతో సంబంధం కలిగి ఉండటం వల్ల ఈ అరుదైన పరిస్థితి తలెత్తింది. ప్రస్తుతం 16 నెలల వయసున్న ఆ ఇద్దరు చిన్నారులు పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు.
వైద్య శాస్త్రంలో దీనిని ‘హెటెరోపేరెంటల్ సూపర్‌ఫెకండేషన్’ అని పిలుస్తారు. డాక్టర్ టులియో జార్జ్ ఫ్రాంకో ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు కేవలం 20 ఇలాంటి కేసులు మాత్రమే నమోదయ్యాయి. ఒకేసారి విడుదలైన రెండు అండాలు వేర్వేరు వ్యక్తుల శుక్రకణాలతో ఫలదీకరణం చెందడం వల్ల ఇది జరుగుతుంది. ప్రస్తుతం ఆ యువతి భాగస్వామి ఇద్దరు పిల్లల బాధ్యతను స్వీకరించి, జనన ధృవీకరణ పత్రంలో తన పేరునే నమోదు చేయించుకున్నారు.