బ్యూటీ పార్లర్‌కు వెళ్లిన పెళ్లికూతురు ప్రియుడితో జంప్ అవమానం భరించలేక మరో అమ్మాయిని ఇవ్వాలని వరుడి హంగామా

బ్యూటీ పార్లర్‌కు వెళ్లిన పెళ్లికూతురు ప్రియుడితో జంప్ అవమానం భరించలేక మరో అమ్మాయిని ఇవ్వాలని వరుడి హంగామా

ఇండోర్‌లోని ఎంజీ రోడ్ ప్రాంతంలో జరిగిన ఒక వింత ఘటన స్థానికంగా కలకలం రేపింది. వివాహ ముహూర్తం దగ్గర పడుతుండగా మేకప్ కోసం బ్యూటీ పార్లర్‌కు వెళ్లిన పెళ్లికూతురు తన ప్రియుడితో కలిసి పరారైంది. అంతకుముందే నిశ్చితార్థం ఘనంగా ముగియడంతో వరుడు ఉజ్జయిని నుండి బంధుమిత్రులతో కలిసి ఉత్సాహంగా పెళ్లి మండపానికి చేరుకున్నాడు. అయితే పెళ్లికూతురు కనిపించలేదనే నిజం తెలుసుకున్న వరుడికి ఏం చేయాలో పాలుపోలేదు.

ఈ అవమానాన్ని భరించలేక వరుడు నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తనకు వెంటనే ఏదో ఒక అమ్మాయితో పెళ్లి చేయాలని పోలీసులను కోరాడు. పెళ్లికూతురు కుటుంబ సభ్యులు తమ కుమార్తె పారిపోయినట్లు ఒప్పుకోవడంతో అక్కడ తీవ్ర గందరగోళం నెలకొంది. చివరికి పోలీసులు నచ్చజెప్పడంతో చేసేదేమీ లేక పెళ్లి కొడుకు బృందం పెళ్లి కాకుండానే వెనుదిరగాల్సి వచ్చింది.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *