శుభ్‌మన్ గిల్ అవుట్! ప్రశ్న అడగ్గానే మౌనంగా వెళ్ళిపోయిన గంభీర్.. వీడియో వైరల్!
December 21, 2025

టీ20 ప్రపంచకప్ జట్టులో శుభ్‌మన్ గిల్‌కు చోటు దక్కకపోవడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. దక్షిణాఫ్రికా సిరీస్‌లో గిల్ విఫలమవ్వడమే దీనికి కారణమని చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ స్పష్టం చేశారు. అయితే, ఢిల్లీ విమానాశ్రయంలో గిల్ ఉద్వాసనపై మీడియా ప్రశ్నించగా, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఏమాత్రం స్పందించకుండా మౌనంగా వెళ్లిపోయారు.
సమాధానం చెప్పకుండా గంభీర్ నేరుగా కారు ఎక్కి వెళ్లిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గంభీర్ తీరుపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. సెలక్షన్‌పై కోచ్ క్లారిటీ ఇవ్వాలని కొందరు అంటుంటే, అనవసర వివాదాలకు ఆయన దూరంగా ఉంటున్నారని మరికొందరు సమర్థిస్తున్నారు.