డ్రైవింగ్ లైసెన్స్ కేవలం కాగితం కాదు అనుభవం మరియు నిరంతర సాధన తప్పనిసరి అన్న సుప్రీంకోర్టు

డ్రైవింగ్ చేయడం అనేది కేవలం లైసెన్స్ కలిగి ఉండటం మాత్రమే కాదని దానికి ఆచరణాత్మక అనుభవం మరియు క్రమం తప్పకుండా సాధన చేయడం కూడా అంతే అవసరమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును తోసిపుచ్చిన ధర్మాసనం ముఖ్యంగా పోలీస్ మరియు విపత్తు నిర్వహణ వంటి కీలక శాఖలలో పనిచేసే వారికి డ్రైవింగ్ నైపుణ్యం ఎంతో ప్రాముఖ్యమని స్పష్టం చేసింది. సాధన లేకపోవడం వల్ల డ్రైవింగ్ సామర్థ్యం దెబ్బతింటుందని కోర్టు పేర్కొంది.
తెలంగాణ పోలీస్ ట్రాన్స్‌పోర్ట్ ఆర్గనైజేషన్ మరియు ఫైర్ సర్వీసెస్ విభాగంలో 325 డ్రైవర్ పోస్టుల భర్తీకి సంబంధించి ఈ కీలక తీర్పు వెలువడింది. నోటిఫికేషన్ నిబంధనల ప్రకారం కనీసం రెండేళ్ల అనుభవం ఉండాలని ఆదేశిస్తూ ఈ భర్తీ ప్రక్రియను మూడు నెలల్లోగా పూర్తి చేయాలని సుప్రీంకోర్టు సూచించింది. అత్యవసర సేవలలో చిన్న పొరపాటు కూడా తీవ్ర పరిణామాలకు దారితీస్తుందని అందుకే డ్రైవింగ్ అనుభవం విషయంలో నిబంధనలు పాటించడం అత్యవసరమని కోర్టు వివరించింది.