మరణించిన వారితో మాట్లాడే అద్భుత ఫోన్ బూత్! జపాన్‌లో వింత అనుభవం

మరణించిన వారితో మాట్లాడే అద్భుత ఫోన్ బూత్! జపాన్‌లో వింత అనుభవం

జపాన్‌లోని ఒట్సుచి నగరంలో కొండపై ఉన్న ఒక వింత ఫోన్ బూత్ ఇప్పుడు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. దీన్ని ‘విండ్ ఫోన్’ అని పిలుస్తారు. ఎటువంటి కనెక్షన్ లేని ఈ ఫోన్ ద్వారా ప్రజలు తమకు దూరమైన మృతులతో మనసు విప్పి మాట్లాడుతుంటారు. 2010లో క్యాన్సర్ వల్ల తన బంధువును కోల్పోయిన ఇతారు ససాకి అనే వ్యక్తి, ఆ బాధ నుండి ఉపశమనం పొందేందుకు ఈ వినూత్నమైన ఆలోచనను అమలులోకి తెచ్చారు.

నిశ్శబ్దంగా ఉండే ఆ కొండ ప్రాంతంలో గాలి వీచినప్పుడు ఫోన్ రిసీవర్‌లో ఒక రకమైన శబ్ద తరంగాలు వినిపిస్తాయి. ససాకి అభిప్రాయం ప్రకారం, ఆ గాలి శబ్దమే మరణించిన వారి భాషగా అనిపిస్తుంది. తమ ఆత్మీయులను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్నవారు ఇక్కడికి వచ్చి, ఫోన్‌లో వారితో మాట్లాడి మనసు తేలిక పరుచుకుంటున్నారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *