జౌన్పూర్లో సాధువులపై పైశాచిక దాడి: వైరల్ వీడియోతో యూపీలో కలకలం!
December 18, 2025

ఉత్తరప్రదేశ్ జౌన్పూర్లో ఇద్దరు సాధువులపై కొందరు యువకులు అమానుషంగా దాడి చేసిన వీడియో సోషల్ మీడియాలో కలకలం రేపుతోంది. పిల్లలను అపహరిస్తున్నారనే అనుమానంతో వారిని చుట్టుముట్టి బెల్టులు, కర్రలతో విచక్షణారహితంగా కొట్టారు. అంతేకాకుండా, వారిని బలవంతంగా గాయత్రీ మంత్రం, హనుమాన్ చాలీసా చదవాలని వేధించారు.
ఈ దాడిలో ఒక సాధువు తప్పించుకోలేక డ్రైనేజీ కాలువలో పడిపోయారు. బాధితులు తాము అమాయకులమని వేడుకున్నా యువకులు కనికరించకుండా వీధుల్లో వెంటాడి కొట్టారు. ఈ ఘటనపై జౌన్పూర్ పోలీసులు తక్షణమే స్పందించి కేసు నమోదు చేశారు. ఇప్పటివరకు ఈ దాడికి పాల్పడిన నలుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.