స్పీకర్ నిర్ణయంపై మేము స్పందించం: రేవంత్
December 18, 2025

TG: ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్ నిర్ణయంపై పార్టీ పరంగా తాము స్పందించబోమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సొంత ఎమ్మెల్యేలు తమ పార్టీలో లేరని చెప్పుకునే దౌర్భాగ్య స్థితిలో బీఆర్ఎస్ ఉందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. స్పీకర్ నిర్ణయం నచ్చకపోతే న్యాయస్థానాలకు వెళ్లవచ్చని తెలిపారు. అటు ప్రతిపక్షాలకు ఇంకా అహం తగ్గలేదని, 2029 ఎన్నికల్లోనూ ఇదే ఫలితాలు రిపీట్ అవుతాయని ధీమా వ్యక్తం చేశారు.