గ్యాంగ్‌స్టర్ నుంచి నిమ్మకాయ బాబాగా అవతారం కోట్ల దోపిడీ వెనుక ఉన్న అసలు నిజం
December 18, 2025

బులంద్‌షహర్‌కు చెందిన కార్ల దొంగ యూసుఫ్ ఇప్పుడు ‘నిమ్మకాయ బాబా’గా మారి ప్రజలను నిలువునా ముంచుతున్నాడు. కేవలం 1100 రూపాయల ప్రవేశ రుసుముతో వశీకరణం, మంత్రతంత్రాల పేరుతో అమాయకులను మోసం చేస్తున్నాడు. పోలీసుల కళ్లు గప్పి ఈ గ్యాంగ్‌స్టర్ ఇప్పటికే కోట్లాది రూపాయల అక్రమ ఆస్తులను కూడబెట్టాడు.
ఢిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతాల్లో విలాసవంతమైన భవంతులు కలిగిన యూసుఫ్, వివిధ నగరాల్లో దర్బార్‌లు నిర్వహిస్తూ ప్రజలను నమ్మిస్తున్నాడు. నోయిడాలో ఇతనిపై అనేక క్రిమినల్ కేసులు ఉన్నప్పటికీ, భక్తి పేరుతో సాగిస్తున్న ఈ దందాపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.