గ్రామాల్లో మంచినీరు లేదు సీసా నీటిపై ఈ విలాసవంతమైన వాదనలేంటి
December 18, 2025

బాటిల్ వాటర్ నాణ్యతపై అంతర్జాతీయ ప్రమాణాలు కావాలన్న పిటిషన్ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. దేశంలో కోట్లాది మందికి కనీస తాగునీరు అందుబాటులో లేని తరుణంలో, ఇలాంటి విన్నపాలు “విలాసవంతమైన వ్యాజ్యాలు” అని జస్టిస్ సూర్యకాంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
గ్రామీణ భారతం నేటికీ భూగర్భ జలాలపైనే ఆధారపడుతోందని, ఈ పిటిషన్ కేవలం పట్టణ ఆలోచనా ధోరణిని ప్రతిబింబిస్తోందని ధర్మాసనం పేర్కొంది. ప్రాథమిక అవసరాలు తీరని పక్షంలో ఇటువంటి సౌకర్యాల గురించి చర్చించడం అనవసరమని కోర్టు స్పష్టం చేసింది.