మహాత్మా గాంధీ పేరు తొలగింపుపై మమతా బెనర్జీ తీవ్ర ఆగ్రహం

మహాత్మా గాంధీ పేరు తొలగింపుపై మమతా బెనర్జీ తీవ్ర ఆగ్రహం

లోక్‌సభలో విపక్షాల నినాదాల మధ్య వీబీ-జీ రామ్జీ బిల్లు ధ్వని ఓటుతో ఆమోదం పొందింది. ఈ బిల్లు ఆమోదం పొందిన వెంటనే స్పీకర్ సభను రోజంతా వాయిదా వేశారు. ఉపాధి హామీ పథకం పేరు మార్పుపై అధికార, ప్రతిపక్షాల మధ్య సభలో తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది.

కోల్‌కతా బిజినెస్ సమ్మిట్‌లో సీఎం మమతా బెనర్జీ ఈ విషయంపై స్పందిస్తూ కేంద్ర నిర్ణయాన్ని తప్పుపట్టారు. మహాత్మా గాంధీ పేరును తొలగించడం సిగ్గుచేటని ఆమె మండిపడ్డారు. జాతి పితను మర్చిపోవడం దురదృష్టకరమని ఆమె వ్యాఖ్యానించారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *