మూడు బస్తాల గోధుమలు అమ్మి కొన్న టికెట్ వృధా

మూడు బస్తాల గోధుమలు అమ్మి కొన్న టికెట్ వృధా

లక్నోలోని ఏకానా స్టేడియంలో భారత్, దక్షిణాఫ్రికా మధ్య జరగాల్సిన నాలుగో టీ20 మ్యాచ్ దట్టమైన పొగమంచు కారణంగా రద్దయింది. మైదానంలో విజిబిలిటీ తక్కువగా ఉండటంతో అంపైర్లు రాత్రి 9:25 గంటలకు మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో మ్యాచ్ చూసేందుకు భారీ సంఖ్యలో తరలివచ్చిన అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు.

తమ టికెట్ డబ్బులు వెనక్కి ఇవ్వాలని అభిమానులు స్టేడియం వెలుపల ఆందోళన చేపట్టారు. ఒక అభిమాని తాను మూడు బస్తాల గోధుమలను అమ్మి ఈ మ్యాచ్ టికెట్ కొన్నానని ఆవేదన వ్యక్తం చేశాడు. తొలిసారి స్టేడియంలో మ్యాచ్ చూడాలని వచ్చిన వేలాది మంది అభిమానుల కల పొగమంచు కారణంగా చెదిరిపోయింది.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *