మరో ఏడు దేశాల పౌరులపై అమెరికాలో ప్రవేశించకుండా ట్రంప్ భారీ నిషేధం
December 17, 2025

మరో ఏడు దేశాల పౌరులు అమెరికాలోకి రాకుండా నిషేధిస్తూ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక పత్రాలపై సంతకం చేశారు. జాతీయ భద్రతా ప్రయోజనాల దృష్ట్యా ఈ కఠినమైన చర్యలు తీసుకున్నట్లు ట్రంప్ ప్రభుత్వం స్పష్టం చేసింది.
వచ్చే ఏడాది జనవరి 1 నుంచి బుర్కినా ఫాసో, నైజర్, మాలి, దక్షిణ సూడాన్ మరియు సిరియా పౌరులపై ఈ ఆంక్షలు అమల్లోకి రానున్నాయి. ఇప్పటికే లావోస్, సియెర్రా లియోన్ వంటి దేశాలపై ఇటువంటి నిషేధాలు విధించిన సంగతి తెలిసిందే.