ఘజియాబాద్‌లో మహిళా చెవి కమ్మలు లాక్కెళ్తూ దొరికిపోయిన ఢిల్లీ పోలీస్ కానిస్టేబుల్
December 17, 2025

ఘజియాబాద్‌లోని షాలిమార్ గార్డెన్‌లో ఒక మహిళ నుంచి చెవి కమ్మలు లాక్కొని పారిపోతున్న ఢిల్లీ పోలీస్ కానిస్టేబుల్‌ను స్థానికులు వెంబడించి పట్టుకున్నారు. డిసెంబర్ 16న రంజన భట్ అనే మహిళ మార్కెట్‌లో ఉన్న సమయంలో బైక్‌పై వచ్చిన నిందితుడు ఆమె నగలను లాక్కున్నాడు. బాధితురాలి అరుపులతో అప్రమత్తమైన జనం అతడిని పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.
నిందితుడు మద్యానికి బానిస అయ్యాడని, కుటుంబ సమస్యల వల్ల ఈ దారి దోపిడీకి పాల్పడినట్లు ఏసీపీ అతుల్ కుమార్ సింగ్ తెలిపారు. నిందితుడిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ఈ ఘటనపై పూర్తి స్థాయి నివేదికను ఢిల్లీ పోలీస్ ప్రధాన కార్యాలయానికి పంపనున్నట్లు అధికారులు వెల్లడించారు.