సిడ్నీ షూటర్ సాజిద్ అక్రమ్ కుటుంబాన్ని కలిపే బంధం ఎందుకు తెగిపోయింది
December 17, 2025

సిడ్నీ బాండీ బీచ్ కాల్పుల నిందితుడు సాజిద్ అక్రమ్ కుటుంబం గత కొన్ని ఏళ్లుగా అతనితో సంబంధాలను తెంచుకుంది. హైదరాబాద్కు చెందిన సాజిద్ ఆస్ట్రేలియా వెళ్లిన తర్వాత ఒక క్రైస్తవ మహిళను వివాహం చేసుకోవడంతో అతని కుటుంబ సభ్యులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
గత 27 ఏళ్లుగా సాజిద్ తన కుటుంబానికి దూరంగా ఉంటున్నాడని, కనీసం తండ్రి మరణానికి కూడా రాలేదని పోలీసులు తెలిపారు. అతని తీవ్రవాద ధోరణికి భారత్తో ఎలాంటి సంబంధం లేదని తెలంగాణ పోలీసులు స్పష్టం చేశారు.