విమాన భోజనాన్ని బ్యాగులో వేసుకుంటున్న మహిళా సీఈఓ దీని వెనుక అసలు కారణం ఇదే

విమాన భోజనాన్ని బ్యాగులో వేసుకుంటున్న మహిళా సీఈఓ దీని వెనుక అసలు కారణం ఇదే

విమాన ప్రయాణంలో మిగిలిపోయిన సీల్డ్ పెరుగు, బ్రెడ్ వంటి ఆహార పదార్థాలు వృధాగా చెత్తకుప్పల్లోకి వెళ్తుంటాయి. ఈ ఆహార వృధాను అరికట్టేందుకు సీఈఓ అన్షు భర్తియా ఒక కొత్త అలవాటును మొదలుపెట్టారు. ఆ ఆహారాన్ని తన బ్యాగులో పెట్టుకుని, విమానం దిగాక అవసరమున్న వారికి అందజేస్తున్నారు. మొదట్లో కాస్త ఇబ్బందిగా అనిపించినా, ఆహారం వృధా కాకూడదనే ఉద్దేశంతో ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారు.

సోషల్ మీడియాలో ఈ విషయం వైరల్ కావడంతో నెటిజన్లు ఆమెను ప్రశంసిస్తున్నారు. విమాన సంస్థలు కూడా ఇలాంటి మంచి ఆహారాన్ని వృధా చేయకుండా పేదలకు పంచేలా నిబంధనలు తీసుకురావాలని కోరుతున్నారు. చిన్న ప్రయత్నమైనా అది ఎంతోమంది ఆకలి తీరుస్తుందని అన్షు నిరూపించారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *