కుక్క కరిస్తే యజమాని జైలుకే! డెహ్రాడూన్‌లో పెంపుడు జంతువులపై కఠిన నిబంధనలు అమలు

కుక్క కరిస్తే యజమాని జైలుకే! డెహ్రాడూన్‌లో పెంపుడు జంతువులపై కఠిన నిబంధనలు అమలు

డెహ్రాడూన్ మున్సిపల్ కార్పొరేషన్ ‘డాగ్ లైసెన్స్ బైలాస్-2025’ పేరుతో కొత్త నిబంధనలను తీసుకువచ్చింది. పెంపుడు కుక్క ఎవరినైనా కరిస్తే యజమానిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడంతో పాటు భారీ జరిమానా విధిస్తారు. పిట్‌బుల్, రాట్‌వీలర్ వంటి ప్రమాదకర జాతులకు లైసెన్స్‌తో పాటు సంతానోత్పత్తి నియంత్రణ సర్టిఫికేట్ సమర్పించడం ఇకపై తప్పనిసరి.

పెంపుడు కుక్కలు బహిరంగ ప్రదేశాల్లో అపరిశుభ్రం చేసినా లేదా రాత్రిపూట మితిమీరి మొరిగినా యజమానులపై చర్యలు తీసుకుంటారు. సాధారణ కుక్కల రిజిస్ట్రేషన్ ఫీజు 500 రూపాయలు కాగా, ప్రమాదకర జాతులకు 2,000 రూపాయలుగా నిర్ణయించారు. ఈ నిబంధనలను బీజేపీ సమర్థించగా, వీధి కుక్కల సమస్యను గాలికొదిలేశారని కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *