లక్ష అప్పు డెబ్బై నాలుగు లక్షలైంది చివరికి విదేశాల్లో కిడ్నీ అమ్ముకున్న రైతు
December 17, 2025

మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లాలో కరుడుగట్టిన వడ్డీ వ్యాపారుల దెబ్బకు ఒక రైతు రోడ్డున పడ్డాడు. కేవలం లక్ష రూపాయల అప్పు వడ్డీలతో కలిపి 74 లక్షలకు చేరడంతో, బాధితుడు రోషన్ కుడే తన భూమిని, ట్రాక్టర్‌ను పోగొట్టుకున్నాడు. ఒత్తిడి తట్టుకోలేక ఏజెంట్ల ద్వారా కంబోడియా వెళ్లి తన కిడ్నీని అమ్ముకోవాల్సి వచ్చింది.
కిడ్నీ అమ్మగా వచ్చిన ఎనిమిది లక్షలు చెల్లించినా వేధింపులు ఆగకపోవడంతో బాధితుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. పోలీసులకు ఫిర్యాదు చేసినా స్పందన లేకపోవడంతో, న్యాయం జరగకుంటే కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకుంటానని రైతు హెచ్చరించాడు.