ఉజ్జయినిలో ఘోరం తొమ్మిదేళ్ల చిన్నారిపై పైశాచిక దాడి

ఉజ్జయినిలో ఘోరం తొమ్మిదేళ్ల చిన్నారిపై పైశాచిక దాడి

మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో మానవత్వం సిగ్గుపడే ఘటన వెలుగుచూసింది. తొమ్మిదేళ్ల బాలికపై అత్యాచార ప్రయత్నం విఫలం కావడంతో, రియాజ్ ఖాన్ అనే యువకుడు ఆమెను అత్యంత కిరాతకంగా కొట్టి చంపాడు. సెలవుల కోసం అమ్మమ్మ ఇంటికి వచ్చిన ఆ చిన్నారి ఒంటరిగా ఉన్న సమయం చూసి నిందితుడు ఈ దారుణానికి ఒడిగట్టాడు. బాలిక కేకలు వేయడంతో ఆమెను ఒక సంచిలో బంధించి, ముద్గరతో విచక్షణారహితంగా కొట్టాడు. ఆపై మేడ మీద నుండి పడిపోయిందని అబద్ధం చెప్పి తప్పించుకోవాలని చూశాడు.

ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆ చిన్నారి ప్రాణాలు విడిచింది. పోలీసుల విచారణలో నిందితుడు తన నేరాన్ని అంగీకరించాడు. పోలీసులు 24 గంటల్లోనే నిందితుడిని అరెస్టు చేసి, వీధుల్లో ఊరేగించారు. ఈ ఘోర కలికి పాల్పడిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *