కారులో శృంగారం నెపంతో ప్రియురాలి తల నరికిన బిలాల్, పెళ్లి రోజే అరెస్ట్ చేసిన పోలీసులు
December 16, 2025

ఉత్తరప్రదేశ్‌లోని సహారన్పూర్లో లివ్-ఇన్ భాగస్వామి ఉమాను అతికిరాతకంగా చంపిన టాక్సీ డ్రైవర్ బిలాల్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. వేరే మహిళతో నిశ్చితార్థం కావడంతో, అడ్డుగా ఉన్న ఉమాను వదిలించుకోవాలని అతను ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. డిసెంబర్ 6న కారులో ఏకాంతంగా ఉన్న సమయంలో గొంతు నులిమి, మాంసం కోసే కత్తితో ఆమె తల నరికి మృతదేహాన్ని వేర్వేరు చోట్ల పడేశాడు.
15 ఏళ్ల క్రితం పెళ్లి రోజే ఇంటి నుండి పారిపోయిన ఉమా, భర్తకు విడాకులిచ్చి బిలాల్‌తో కలిసి ఉంటోంది. హత్య చేసిన తర్వాత ఏమీ తెలియనట్టు తన పెళ్లి పనుల్లో మునిగిపోయిన బిలాల్‌ను పోలీసులు పెళ్లి పీటల మీద నుండే అదుపులోకి తీసుకున్నారు. దాదాపు 15 ఏళ్ల తర్వాత తన కూతురిని తల లేని మొండెం రూపంలో చూసి ఆమె తండ్రి కన్నీరుమున్నీరయ్యారు.