గర్భవతి అని కూడా చూడకుండా భార్య నగ్న ఫోటోలు వైరల్! విక్రయించేందుకు భర్త కుట్ర
December 16, 2025

ఉత్తరప్రదేశ్లోని గాజీపూర్లో ఒక భర్త తన గర్భవతి అయిన భార్య పట్ల అత్యంత దారుణంగా ప్రవర్తించాడు. ఆమె అసభ్యకర ఫోటోలు, వీడియోలను తన స్నేహితులకు పంపడమే కాకుండా, ఆమెను విక్రయిస్తానని బెదిరించాడు. ఈ విషయాన్ని ప్రశ్నించినందుకు భార్యను కొట్టి, బలవంతంగా మద్యం తాగించినట్లు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఐదు నెలల గర్భవతి అయిన ఆ మహిళ, పోలీసుల వద్దకు వెళ్లి తన గోడును వెళ్లబోసుకుంది. ఎస్పీ ఆదేశాల మేరకు నిందితుడిపై కేసు నమోదైంది. తనకు న్యాయం జరగకపోతే ఆత్మహత్య చేసుకుంటానని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.