మెస్సీ కాళ్ళ ఇన్సూరెన్స్ ప్రీమియం ఎంతో తెలుసా
December 16, 2025

ప్రముఖ ఫుట్బాల్ ఆటగాడు లియోనెల్ మెస్సీ తన కాళ్ళకు సుమారు 8,100 కోట్ల రూపాయల బీమా చేయించుకున్నారు. క్రీడాకారుల బీమా ప్రీమియం సాధారణంగా మొత్తం విలువలో 0.8 నుండి 2 శాతం వరకు ఉంటుంది. ఈ లెక్కన మెస్సీ చెల్లించే వార్షిక ప్రీమియం అక్షరాలా కోట్లలో ఉంది.
కనీసం 1 శాతం ప్రీమియంగా పరిగణించినా మెస్సీ ఏడాదికి 81 కోట్ల రూపాయలు చెల్లిస్తున్నారు. ఒకవేళ రిస్క్ శాతం పెరిగితే ఈ మొత్తం ఏకంగా 135 కోట్ల రూపాయల వరకు చేరే అవకాశం ఉంది. క్రీడా ప్రపంచంలో ఇది అత్యంత ఖరీదైన బీమాగా నిలుస్తోంది.