ప్రభుత్వ నిధులతో బాబ్రీ మసీదు నిర్మాణం నేహ్రూ కోరిక? రాజ్‌నాథ్ సంచలన ఆరోపణతో కొత్త వివాదం

ప్రభుత్వ నిధులతో బాబ్రీ మసీదు నిర్మాణం నేహ్రూ కోరిక? రాజ్‌నాథ్ సంచలన ఆరోపణతో కొత్త వివాదం

రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ (Rajnath Singh) చేసిన వ్యాఖ్యలు కొత్త రాజకీయ వివాదానికి దారితీశాయి. వడోదరలో సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకలో ఆయన మాట్లాడుతూ, స్వాతంత్య్రానంతర భారతదేశపు తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ ప్రజల పన్ను డబ్బుతో బాబ్రీ మసీదును నిర్మించాలని కోరుకున్నారని ఆరోపించారు. నెహ్రూ యొక్క ఈ ప్రతిపాదనను అప్పటి హోంమంత్రి సర్దార్ పటేల్ గట్టిగా వ్యతిరేకించారని, ప్రభుత్వ నిధులను ఏ మతపరమైన నిర్మాణానికి ఉపయోగించకూడదని పటేల్ స్పష్టం చేశారని రాజ్‌నాథ్ (Rajnath Singh) అన్నారు.

పటేల్ నిజమైన లౌకికవాది, తద్వారా ప్రభుత్వ నిధులతో బాబ్రీ మసీదు నిర్మాణం జరగలేదని రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు. సోమనాథ దేవాలయం, ప్రస్తుత రామ మందిర నిర్మాణాలను ఉదహరించిన ఆయన, ప్రభుత్వ డబ్బును ఉపయోగించకుండా ప్రజల విరాళాలతోనే అన్ని మత నిర్మాణాలు జరుగుతున్నాయని తెలిపారు. ప్రభుత్వాలు కాకుండా, ప్రజలే మత సంస్థలను నిర్మించడం లౌకికవాదానికి సరైన నిర్వచనమని ఆయన వాదించారు. రాజ్‌నాథ్ సింగ్ చేసిన ఈ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా రాజకీయంగా ప్రకంపనలు సృష్టించాయి.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *