వైద్య అద్భుతం మూడు పురుషాంగాలతో శిశువు జననం డాక్టర్లు విస్మయం

వైద్య అద్భుతం మూడు పురుషాంగాలతో శిశువు జననం డాక్టర్లు విస్మయం

ఉత్తర ఇరాక్‌లోని మోసుల్‌లో మూడు పురుషాంగాలతో ఒక నవజాత శిశువు జన్మించిన అరుదైన కేసు నమోదైంది. వైద్య చరిత్రలో ఒక శిశువుకు మూడు అదనపు పురుషాంగాలు (ట్రైఫాలియా) ఉండటం ఇదే మొదటి కేసుగా నమోదు చేయబడింది. సాధారణంగా, సూపర్‌న్యూమరరీ పురుషాంగాలు (ఒకటి కంటే ఎక్కువ) 50 నుండి 60 లక్షల జననాలలో ఒకరికి సంభవిస్తాయి, అయితే ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా రెండు పురుషాంగాల (డైఫాలియా) యొక్క సుమారు 100 కేసులు మాత్రమే నమోదయ్యాయి. ఈ అసాధారణ సంఘటన ప్రపంచవ్యాప్తంగా ఉన్న వైద్య నిపుణులను ఆశ్చర్యపరిచింది మరియు ఇది ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ సర్జరీలో కేస్ స్టడీగా ప్రచురించబడింది.

శిశువుకు సాధారణ పురుషాంగంతో పాటు, వరుసగా 2 సెం.మీ మరియు 1 సెం.మీ పొడవు గల రెండు అదనపు పురుషాంగాలు ఉన్నట్లు వైద్యులు ధృవీకరించారు. ఈ అదనపు అవయవాలు ఏ విధమైన శారీరక విధుల్లోనూ పాల్గొనలేవు. పరీక్ష అనంతరం, వైద్య బృందం అనవసరమైన ఆ రెండు పురుషాంగాలను శస్త్రచికిత్స ద్వారా తొలగించాలని నిర్ణయించింది. గర్భధారణ సమయంలో సమస్యలు లేదా కుటుంబ జన్యుపరమైన చరిత్ర దీనికి కారణం కావచ్చునని వైద్యులు తెలిపారు. ఇది ట్రైఫాలియాకు సంబంధించిన మొదటి కేసు అయినప్పటికీ, 2015లో భారతదేశంలో ఇలాంటి కేసు నమోదైంది, అయితే ఆ సమయంలో తగినంత వైద్య ఆధారాలు లభించలేదు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *