పసుపు ప్లాక్‌ను తొలగించుకోవడానికి సులభమైన చిట్కాలు! మెరిసే చిరునవ్వు మీ సొంతం

పళ్ళను సరిగా శుభ్రం చేయకపోవడం వల్ల పసుపు ప్లాక్ పేరుకుపోవడం సర్వసాధారణ సమస్య. ఇది పళ్ళ అందాన్ని తగ్గించి, నోటి దుర్వాసనకు దారితీస్తుంది. ముఖ్యంగా ధూమపానం చేసేవారిలో, తరచుగా కెఫీన్ తీసుకునేవారిలో ఈ సమస్య పెరుగుతుంది. శాశ్వత పరిష్కారం కోసం దంత వైద్యుడిని సంప్రదించడం ముఖ్యం అయినప్పటికీ, కొన్ని సాధారణ ఇంటి చిట్కాలతో దీనిని తగ్గించుకోవచ్చు.
పసుపు ప్లాక్‌ను తొలగించడానికి బేకింగ్ సోడా అద్భుతమైన సహజ క్లీనర్‌గా పనిచేస్తుంది. ఒక టేబుల్ స్పూన్ బేకింగ్ సోడాలో చిటికెడు ఉప్పు కలిపి తడి బ్రష్‌తో రుద్దితే పేరుకుపోయిన పసుపు పొర తొలగుతుంది. అంతేకాకుండా, కలబంద గుజ్జు, గ్లిసరిన్, నిమ్మ నూనెల మిశ్రమంతో చేసిన సహజ పేస్ట్‌ను ఉపయోగించడం కూడా ప్రయోజనకరం. నారింజ తొక్కను పళ్ళపై రుద్దడం లేదా విటమిన్-సి అధికంగా ఉండే పండ్లు (టొమాటో, స్ట్రాబెర్రీ) పేస్ట్‌ను 5-6 నిమిషాలు ఉంచడం వలన నోటిలోని బ్యాక్టీరియా నశించి, ప్లాక్ మరకలు తగ్గుతాయి.