35 ఏళ్ల తర్వాత బంగ్లాదేశ్ రాజకీయాల్లో పెను మార్పు

35 ఏళ్ల తర్వాత బంగ్లాదేశ్ రాజకీయాల్లో పెను మార్పు

బంగ్లాదేశ్‌లో 35 ఏళ్ల మహిళా నాయకత్వానికి తెరదించుతూ తారిఖ్ రెహమాన్ కొత్త ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బీఎన్‌పీ కూటమి 212 స్థానాల్లో ఘనవిజయం సాధించి అధికార పీఠాన్ని దక్కించుకుంది. వచ్చే వారమే కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేయనుండటంతో దేశ రాజకీయ చరిత్రలో కొత్త అధ్యాయం మొదలుకానుంది.

ఎన్నికలతో పాటు జరిగిన ప్రజాభిప్రాయ సేకరణలో ప్రభుత్వ సంస్కరణలకు మద్దతు లభించడంతో రాజ్యాంగంలో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. మరోవైపు, జమాత్ కూటమి 70 స్థానాలను గెలుచుకుని బలమైన ప్రతిపక్షంగా అవతరించింది. ఏడాదిన్నర మధ్యంతర పాలన తర్వాత ప్రజాస్వామ్య ప్రక్రియ పునరుద్ధరణ రాజకీయ స్థిరత్వానికి దారితీస్తుందని భావిస్తున్నారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *