33 ఏళ్ల వయసులోనే 13వ సారి గర్భం దాల్చిన మహిళ ఇంతమంది పిల్లల వెనుక అసలు కారణం ఇదే

33 ఏళ్ల వయసులోనే 13వ సారి గర్భం దాల్చిన మహిళ ఇంతమంది పిల్లల వెనుక అసలు కారణం ఇదే

అమెరికాలోని న్యూ మెక్సికోకు చెందిన 33 ఏళ్ల బ్రిట్నీ చర్చ్ ప్రస్తుతం 13వ సారి తల్లి కాబోతున్నారు. 16 ఏళ్ల వయసులో మొదటి బిడ్డకు జన్మనిచ్చిన ఆమె, ఒక పెద్ద కుటుంబం ఉండాలనే కోరికతో దాదాపు ప్రతి సంవత్సరం ఒక బిడ్డకు జన్మనిస్తూ వచ్చారు. ఇప్పటికే ఈ దంపతులకు 12 మంది పిల్లలు ఉండగా, వారందరి పేర్లు ‘సి’ అక్షరంతోనే ప్రారంభమవుతాయి. పిల్లల కోరిక మేరకు మరియు నిండు కుటుంబం కోసం తాను ఇన్నిసార్లు గర్భం దాల్చినట్లు బ్రిట్నీ వివరించారు.

ఇంత పెద్ద కుటుంబాన్ని పోషించడం సామాన్యమైన విషయం కాదు, కేవలం పాలకు మాత్రమే నెలకు సుమారు 16 వేల రూపాయల ఖర్చవుతుంది. చర్చిలో పాస్టర్ గా పనిచేసే తన భర్తతో కలిసి 12 ఎకరాల పొలంలో 140 జంతువుల మధ్య వీరు నివసిస్తున్నారు. పిల్లలందరికీ ఇంట్లోనే విద్యను అందిస్తున్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే బ్రిట్నీ తన కుటుంబ ఫోటోలను పంచుకుంటూ ఉంటారు, అయితే ఇంతమంది పిల్లలను కనడంపై నెటిజన్ల నుండి ఆమె తరచుగా విమర్శలను ఎదుర్కొంటున్నారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *