15 రోజులకు ఒకసారి స్నానం చేసే ప్రియురాలు దుర్వాసనతో తట్టుకోలేక ప్రియుడి వింత కష్టం
February 22, 2026

న్యూస్ డెస్క్ : ప్రేమించిన అమ్మాయితో కలిసి ఉందామని సహజీవనం మొదలుపెట్టిన ఒక యువకుడికి ఇప్పుడు ఊపిరాడటం లేదు. తన ప్రియురాలు 15 రోజులకు ఒకసారి మాత్రమే స్నానం చేస్తుందని, ఆ దుర్వాసన భరించలేక తాను బెడ్ రూమ్ వదిలి సోఫాలో పడుకుంటున్నానని అతను వాపోతున్నాడు.
మూడేళ్ల ప్రేమ తర్వాత కలిసుండటం మొదలుపెట్టాకే ఆమెలోని ఈ వింత అలవాటు బయటపడింది. ఎన్నిసార్లు చెప్పినా ఆమె స్నానం చేయడానికి ఒప్పుకోకపోగా ఎదురు దాడికి దిగుతోంది. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో, ఇంతటి అపరిశుభ్రమైన వ్యక్తితో కలిసి ఉండటం అనారోగ్యకరమని నెటిజన్లు అతనికి సలహాలు ఇస్తున్నారు.