15 ఏళ్ల బంధంలో దారుణ మోసం జీపీఎస్ సాయంతో భార్యను హోటల్‌లో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న భర్త

15 ఏళ్ల బంధంలో దారుణ మోసం జీపీఎస్ సాయంతో భార్యను హోటల్‌లో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న భర్త

అమృత్‌సర్‌లో 15 ఏళ్ల వైవాహిక బంధాన్ని కాలరాస్తూ ఒక మహిళ వివాహేతర సంబంధంలో పట్టుబడటం సంచలనం సృష్టించింది. భార్య ప్రవర్తనపై అనుమానంతో భర్త రవి గులాటి ఆమె స్కూటీకి జీపీఎస్ ట్రాకర్‌ను అమర్చాడు. ఆ లొకేషన్ ఆధారంగా ఒక హోటల్‌కు చేరుకున్న అతను, తన భార్యను మరో వ్యక్తితో కలిసి ఉండగా చూసి కన్నీటి పర్యంతమయ్యాడు.

2010లో వివాహం చేసుకున్న ఈ దంపతులకు పిల్లలు కూడా ఉన్నారు. గతంలో 2018లో కూడా ఇదే విధంగా పట్టుబడగా, కుటుంబ గౌరవం కోసం రవి ఆమెను క్షమించాడు. తాజాగా మరోసారి దొరికిపోవడంతో ఆ మహిళ తన పుట్టింటికి వెళ్తానని తెగేసి చెప్పింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కావడంతో నైతిక విలువలపై చర్చ మొదలైంది.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *