12 ఏళ్ల డయాబెటిస్ రివర్స్! ఈ 3 చిట్కాలతో 42 ఏళ్ల వ్యక్తికి మందులు బంద్
December 15, 2025

నేటి జీవనశైలి వ్యాధులలో డయాబెటిస్ సర్వసాధారణం. సరైన ఆహారం, జీవనశైలి మార్పులతో రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచవచ్చు. 12 సంవత్సరాలుగా డయాబెటిస్‌తో బాధపడుతున్న తన 42 ఏళ్ల రోగికి కేవలం మూడు ముఖ్యమైన మార్పులతో మందులు లేకుండా వ్యాధిని రివర్స్ చేయగలిగామని పోషకాహార నిపుణురాలు డా. హర్షిత కౌశిక్ వెల్లడించారు.
మొదటగా, రాత్రి భోజనంలో ప్రొటీన్, ఫైబర్ అధికంగా ఉండే సోయాబీన్ లేదా శనగల సలాడ్ వంటివి తీసుకోవడం, అధిక కార్బోహైడ్రేట్లను నివారించడం. రెండవది, ప్రతిరోజూ రాత్రి 7 గంటలలోపు భోజనం ముగించి, ఆ తర్వాత తప్పనిసరిగా 10-15 నిమిషాలు నడవడం. చివరగా, నిద్రపోయే 30 నిమిషాల ముందు ‘గుడ్మార్’ అనే ఆయుర్వేద మూలికను తీసుకోవడం, ఇది ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచడంలో, చక్కెర స్థాయి నియంత్రణలో సహాయపడుతుంది.