హోటల్ గదిలో ఘోరం! ప్రియుడిపై దాడి చేసిన ప్రియురాలికి విషాదకర ముగింపు

పంజాబ్ రాష్ట్రం లూథియానాలో జరిగిన హృదయవిదారక ఘటనలో ఓ మహిళ మృతి చెందగా, ఆమె ప్రియుడు గాయపడ్డాడు. లూథియానాకు చెందిన అమిత్ నిషాద్, ఇద్దరు పిల్లల తల్లి అయిన ఓ మహిళతో ప్రేమలో ఉన్నాడు. భర్తతో విడాకుల ప్రక్రియలో ఉన్న ఆ మహిళ, తనను పెళ్లి చేసుకోవాలని అమిత్‌ను నిరంతరం ఒత్తిడి చేసింది, కానీ అమిత్ నిరాకరించాడు. ఈ పరిస్థితుల్లో, నిన్న వారిద్దరూ లూథియానాలోని ఒక హోటల్‌లో గదిని అద్దెకు తీసుకున్నారు.
అక్కడ మళ్లీ పెళ్లి విషయంపై తీవ్ర వాగ్వాదం జరిగింది. కోపం పట్టలేని ఆ మహిళ, అకస్మాత్తుగా కత్తి తీసుకుని అమిత్ మర్మాంగాన్ని పొడిచింది. నొప్పితో విలవిలలాడిన అమిత్, ఆ కోపంతో ఆ మహిళ గొంతు నులిమి చంపేసి, అక్కడి నుంచి పారిపోయాడు. హోటల్ సిబ్బంది అందించిన సమాచారం మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కొన్ని గంటల్లోనే పరారైన నిందితుడు అమిత్ నిషాద్‌ను పోలీసులు అరెస్టు చేసి, చికిత్స కోసం ఆసుపత్రిలో చేర్చారు. ఈ సంఘటన లూథియానా ప్రాంతంలో తీవ్ర కలకలం రేపింది.