హెల్మెట్‌పై త్రివర్ణ పతాకానికి బదులు పాలస్తీనా జెండా కశ్మీర్ క్రికెటర్‌పై పోలీసుల ఉక్కుపాదం

హెల్మెట్‌పై త్రివర్ణ పతాకానికి బదులు పాలస్తీనా జెండా కశ్మీర్ క్రికెటర్‌పై పోలీసుల ఉక్కుపాదం

జమ్మూ కాశ్మీర్ ఛాంపియన్స్ లీగ్ సందర్భంగా జేకే 11 జట్టుకు ఆడుతున్న ఫుర్కాన్ భట్ అనే క్రికెటర్ తన హెల్మెట్‌పై భారత త్రివర్ణ పతాకానికి బదులుగా పాలస్తీనా జెండాను ధరించి మైదానంలోకి దిగాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో క్రీడాభిమానుల నుండి తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. రంగంలోకి దిగిన జమ్మూ రూరల్ పోలీసులు సదరు క్రికెటర్‌ను విచారణ నిమిత్తం అదుపులోకి తీసుకున్నారు మరియు లీగ్ నిర్వాహకుడు జాహిద్ భట్‌ను కూడా ప్రశ్నిస్తున్నారు.

ఈ వివాదంపై జమ్మూ కాశ్మీర్ క్రికెట్ అసోసియేషన్ (JKCA) స్పందిస్తూ ఈ లీగ్‌కు తమతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. బీసీసీఐ లేదా జేకేసీఏ ఈ టోర్నమెంట్‌కు ఎటువంటి గుర్తింపు ఇవ్వలేదని అసోసియేషన్ ప్రతినిధి బ్రిగేడియర్ అనిల్ గుప్తా తెలిపారు. క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరించిన సదరు ఆటగాడిపై మరియు నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉందని అధికార వర్గాలు వెల్లడించాయి.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *