స్నానం చేసేటప్పుడు మీరు చేసే చిన్న పొరపాటే ప్రాణాంతకం కావచ్చు బాత్‌రూమ్‌లో స్ట్రోక్ రావడానికి అసలు కారణం ఇదే

స్నానం చేసేటప్పుడు మీరు చేసే చిన్న పొరపాటే ప్రాణాంతకం కావచ్చు బాత్‌రూమ్‌లో స్ట్రోక్ రావడానికి అసలు కారణం ఇదే

బాత్‌రూమ్‌లో స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉండటానికి మనం స్నానం చేసే పద్ధతే ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు. నేరుగా తలపై నీళ్లు పోసుకోవడం వల్ల శరీర ఉష్ణోగ్రతలో అకస్మాత్తుగా మార్పు వచ్చి రక్తపోటు పెరుగుతుంది. దీనివల్ల మెదడులోని ధమనులు చిట్లిపోయి పక్షవాతం లేదా మరణం సంభవించే అవకాశం ఉందని కెనడియన్ మెడికల్ అసోసియేషన్ జర్నల్ హెచ్చరించింది. ఈ తప్పుడు అలవాటు వల్ల ప్రపంచవ్యాప్తంగా స్నానపు గదుల్లో ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది.

ఆరోగ్యంగా ఉండటానికి స్నానం చేసేటప్పుడు ముందుగా పాదాలను తడపాలి. ఆపై క్రమంగా మోకాళ్లు, భుజాల వరకు నీళ్లు పోసుకుంటూ చివరగా తల తడుపుకోవాలి. ఇలా చేయడం వల్ల శరీర ఉష్ణోగ్రత బయటి వాతావరణానికి అనుగుణంగా సర్దుబాటు అవుతుంది. ముఖ్యంగా రక్తపోటు, కొలెస్ట్రాల్ మరియు మైగ్రేన్ సమస్యలు ఉన్నవారు ఈ పద్ధతిని తప్పనిసరిగా పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *