స్కూల్‌లో గుండెపోటు, 9 ఏళ్ల బాలిక మృతి, గంటలో రెండుసార్లు

స్కూల్‌లో గుండెపోటు, 9 ఏళ్ల బాలిక మృతి, గంటలో రెండుసార్లు

రాజస్థాన్, సికార్ జిల్లాలో 9 ఏళ్ల నాలుగో తరగతి విద్యార్థిని ప్రాచీ కుమావత్, స్కూల్‌లో గుండెపోటుతో మరణించింది. మంగళవారం ఉదయం క్లాస్‌లో ఉన్నప్పుడు ప్రాచి అకస్మాత్తుగా అస్వస్థతకు గురికాగా, ఆమెను స్థానిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అక్కడ ఆమెకు రెండోసారి గుండెపోటు రావడంతో, సికార్ ఆసుపత్రికి రిఫర్ చేశారు. ఆసుపత్రికి తరలిస్తున్న మార్గమధ్యంలోనే ప్రాచి మరణించింది. వైద్యులు ప్రాథమికంగా దీనిని గుండెపోటుగానే భావిస్తున్నారు, అయితే పోస్ట్‌మార్టం నివేదిక ఇంకా రాలేదు. ప్రాచి సంతోషంగా మరియు తెలివైన విద్యార్థినిగా ఉండేది.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *