సోషల్ మీడియా పోస్ట్‌తో చిక్కిన బంగ్లాదేశ్ జంట ఉత్తరప్రదేశ్‌లో అరెస్ట్
December 13, 2025

ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహాలో అక్రమంగా నివసిస్తున్న బంగ్లాదేశ్ జంట రినా బేగం, రషీద్ అలీలను పోలీసులు అరెస్టు చేశారు. సౌదీ అరేబియాలో ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ దంపతులు, ఈ ఏడాది మార్చిలో బంగ్లాదేశ్‌కు తిరిగి వచ్చారు. ఆ తర్వాత, అక్టోబర్ 9న నేపాల్ మీదుగా అక్రమ మార్గంలో భారత్‌లోకి ప్రవేశించి అమ్రోహా జిల్లాలోని మాండి ధనౌరా ప్రాంతంలో నివసించడం మొదలుపెట్టారు.
‘బై బై బంగ్లాదేశ్’ అనే శీర్షికతో రినా బేగం సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఒక వీడియో పోలీసుల దృష్టికి వచ్చింది. రహస్య సమాచారం మేరకు పోలీసులు విచారణ ప్రారంభించగా, ఈ జంట సరైన పత్రాలు లేకుండా భారత్‌లోకి ప్రవేశించినట్లు నిర్ధారణ అయింది. సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, అక్రమంగా దేశంలోకి రావడానికి సహాయం చేసిన వారి గురించి కూడా దర్యాప్తు జరుగుతోంది.