సూట్‌కేస్‌లో దొరికిన అస్థిపంజరం వెనుక భయంకరమైన నిజం
December 17, 2025

హాపూర్ పొలాల్లో సూట్‌కేస్‌లో లభ్యమైన యువతి అస్థిపంజరం కేసును పోలీసులు ఛేదించారు. జార్ఖండ్‌కు చెందిన పనిమనిషిపై అంకిత్ అనే వ్యక్తి లైంగిక దాడికి పాల్పడి, తన భార్యతో కలిసి ఆమెను కొట్టి చంపినట్లు తేలింది. నిందితులు ఇద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
లైంగిక వేధింపుల వీడియో బయటపడుతుందనే భయంతో నోయిడాలో ఈ హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని సూట్‌కేస్‌లో కుక్కి హాపూర్‌లో పడేశారు. ఢిల్లీ వ్యాపారి ఇచ్చిన సమాచారంతో ఈ దారుణ ఉదంతం వెలుగులోకి వచ్చింది.