సుంకాల యుద్ధంపై ‘బాయ్‌కాట్ అమెరికా’ నినాదం, సోషల్ మీడియాలో చర్చ

సుంకాల యుద్ధంపై ‘బాయ్‌కాట్ అమెరికా’ నినాదం, సోషల్ మీడియాలో చర్చ

గాల్వాన్ ఘర్షణ జరిగిన ఐదేళ్ల తర్వాత, మరోసారి విదేశీ వస్తువులను బహిష్కరించాలనే డిమాండ్ తెరపైకి వచ్చింది, అయితే ఈసారి అమెరికా బ్రాండ్లపై దృష్టి సారించారు. భారతీయ ఉత్పత్తులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 50% సుంకం విధించడాన్ని నిరసిస్తూ ఈ డిమాండ్ మొదలైంది. ఈ సుంకాల యుద్ధానికి ప్రతిస్పందనగా, అమెరికా కంపెనీలకు గుణపాఠం చెప్పేందుకు అమెరికా బ్రాండ్‌లను బహిష్కరించాలని చాలామంది నెటిజన్లు పిలుపునిస్తున్నారు.

‘Wow Skin Science in India’ సహ-వ్యవస్థాపకుడు మనీష్ చౌదరి మాట్లాడుతూ, దేశీయ రైతులు, స్టార్టప్‌ల ప్రయోజనాల కోసం అమెరికా ఉత్పత్తులను బహిష్కరించాలని అన్నారు. అదేవిధంగా, డ్రైవ్‌యూ సీఈఓ రహమ్ శాస్త్రి మాట్లాడుతూ, చైనా మాదిరిగా అమెరికా సోషల్ మీడియాకు ప్రత్యామ్నాయ ప్లాట్‌ఫారమ్‌లను భారత్ రూపొందించాలని సూచించారు. ఈ అంశంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *