సిడ్నీ మారణకాండ బాండీ బీచ్‌లో యూదులపై దాడి చేసిన నవీద్ అక్రమ్ గుర్తింపు
December 14, 2025

ఆస్ట్రేలియాలోని సిడ్నీలోని బాండీ బీచ్‌లో యూదుల హనుక్కా ఉత్సవ సన్నాహాల సందర్భంగా ఇద్దరు గన్‌మెన్‌లు జరిపిన కాల్పుల్లో తొమ్మిది మంది మరణించారు. మరణించిన వారిలో ఒక అగంతకుడు కూడా ఉన్నాడు. చనిపోయిన అగంతకులలో ఒకరిని నవీద్ అక్రమ్ (24)గా గుర్తించారు, ఇతను సిడ్నీలోని బోనిరిగ్ నివాసి.
సుమారు 2,000 మంది గుమిగూడిన జనసందోహంపై విచక్షణారహితంగా కాల్పులు జరిగాయి. ఈ ఘటనను ఇజ్రాయెల్ అధ్యక్షుడు తీవ్రవాద దాడిగా పేర్కొన్నారు. ఈ దారుణం తరువాత, మెల్‌బోర్న్‌లో జరగాల్సిన హనుక్కా ఉత్సవాన్ని రద్దు చేశారు.