సింధూరం పెట్టే సమయంలో వరుడి ఫోన్‌కు వచ్చిన ఆ మెసేజ్ మండపం నుంచి వరుడు పరార్
December 28, 2025

జార్ఖండ్‌లోని గిరిడీలో ఒక వివాహ వేడుక ఊహించని మలుపు తిరిగింది. పెళ్లి తంతు దాదాపు ముగిసి, వరుడు వధువుకు సింధూరం పెట్టబోతున్న తరుణంలో అతడి మొబైల్‌కు ఒక అపరిచిత సందేశం వచ్చింది. అందులో వధువుకు గతంలో మరొకరితో సంబంధం ఉందని, ఆమె ప్రియుడు అనుమానాస్పద స్థితిలో మరణించాడని ఉంది. ఆ మెసేజ్ చూసి ఒక్కసారిగా షాక్‌కు గురైన వరుడు, ఎవరికీ చెప్పకుండా మండపం నుండి పరారయ్యాడు.
వరుడు కనిపించకపోవడంతో వివాహ వేడుకలో ఒక్కసారిగా గందరగోళం నెలకొంది మరియు ఇరు వర్గాల మధ్య గొడవ ప్రారంభమైంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. కొన్ని రోజుల క్రితమే వధువు మాజీ ప్రియుడి మృతదేహం రైల్వే ట్రాక్ వద్ద లభించినట్లు తేలింది. ప్రస్తుతం ఈ వింత ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.