షేక్ హసీనాను తిరిగి అప్పగించాలని భారత్ ను కోరిన బిఎన్పి నేతలు
February 13, 2026

బంగ్లాదేశ్ లో తారిఖ్ రెహ్మాన్ నాయకత్వంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరుతున్న వేళ మాజీ ప్రధాని షేక్ హసీనాను తిరిగి దేశానికి పంపాలని బిఎన్పి నేత సలావుద్దీన్ అహ్మద్ డిమాండ్ చేశారు. చట్టప్రకారం ఆమెపై విచారణ జరిపేందుకు భారత్ ప్రభుత్వం సహకరించాలని మరియు ఆమెను అప్పగించాలని ఆయన కోరారు.
భారీ మెజారిటీతో అధికారంలోకి వస్తున్న బిఎన్పి కూటమి హసీనా పాలనపై న్యాయపరమైన చర్యలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో తమ దేశ మాజీ ప్రధానిని రప్పించేందుకు బిఎన్పి చేస్తున్న ఈ ప్రయత్నం ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది.